Site icon NTV Telugu

“ఏజెంట్”తో సురేందర్ రెడ్డి చర్చలు

Akhil Akkineni and director Surender Reddy having a casual discussion

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో, డైరెక్టర్ మధ్య క్యాజువల్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అఖిల్, సురేందర్ రెడ్డి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించారు. ఇక “ఏజెంట్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిపోయాడు. కండలు తిరిగిన దేహంతో, ఉంగరాల జుట్టుతో ఇంతకుముందెన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హాలీవుడ్ హీరో స్టైల్ లో కన్పిస్తున్న అఖిల్ ను చూసి అంతా ఫిదా అయిపోయారు.

Read Also : “చియాన్ 60” షూటింగ్ పూర్తి

అఖిల్ తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ అందించే చిత్రం కోసం చూస్తున్నాడు. ఆ చిత్రం “ఏజెంట్” అవుతుందని అఖిల్ తో పాటు ఆయన అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో నటుడి సరికొత్త కోణాన్ని చూపిస్తానని సురేందర్ రెడ్డి అభిమానులకు హామీ ఇచ్చారు. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. థమన్ స్వరాలు సమకూర్చనున్నారు. మరోవైపు అఖిల్ అక్కినేని హీరోగా “బొమ్మరిల్లు” భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే స్టాండ్-అప్ కమెడియన్‌గా నటిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version