Site icon NTV Telugu

Akhil Akkineni: ప్రభాస్ తో జాగ్రత్త.. అక్కినేని వారసుడి సంచలన వ్యాఖ్యలు

Akhil

Akhil

Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక అఖిల్ కు ఇండస్ట్రీలోని హీరోలందరితోనూ స్నేహం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు అఖిల్ తమ్ముడితో సమానం. ఈ విషయాన్ని సదరు హీరోలు ఏదో ఒక ఫంక్షన్ లో చెప్తూనే ఉంటారు. ఇక నాగార్జున భార్య, అఖిల్ తల్లి అమల ప్రస్తుతం ఒకే ఒక జీవితం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. శర్వానంద్, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తల్లి కోసం అఖిల్ బాబు రంగంలోకి దిగాడు.

అమ్మ చేతి వంట అనే పేరుతో అమల ను, శర్వాను అఖిల్ ఇంటర్వ్యూ చేశాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఇంటర్వ్యూలో ఏం వంట చేయాలి అని అమల అడుగగా శర్వా ఏదైనా పర్లేదు.. అమ్మ చేతి వంట ఏదైనా బావుంటుంది అని చెప్తాడు.. వెంటనే అఖిల్, అమ్మ వంట బాగా చేస్తోంది అని చెప్తాడు. ఇక అమల మాట్లాడుతూ ప్రభాస్ చాలా ఆహార ప్రియుడు(foody) అని విన్నాను అనిచెప్పగా శర్వా చాలా ఆహార ప్రియుడు అని అనగా.. అఖిల్.. ప్రభాస్ ను నువ్వు కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఫుడ్ గురించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా మాట్లాడుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. షూటింగ్ ఏదైనా , హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్ తినకుండా బయటికి వెళ్ళలేరు అనేది నిజం. అందుకే అఖిల్ సైతం ఆ మాట అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version