బాలకృష్ణ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ తాండవం సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ అంటే రేపు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ప్రీమియర్స్‌తో ఒకరోజు ముందుగానే ప్రదర్శిస్తున్నట్లు సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ మేరకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
అయితే, తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కోసం సినిమా టీమ్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఇంకా ఈ మేరకు జీవో జారీ చేయలేదు.
Also Read :Gulshan Devaiah: సమంత హీరోగా కాంతార విలన్
ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ, “పెంచిన టికెట్ రేట్ల లాభంలో కొంత శాతం సినీ కార్మికులకు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సుముఖత వ్యక్తం చేస్తేనే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని” పేర్కొన్నారు. ఆ ప్రకటన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో, విధివిధానాల రూపకల్పనకు కాస్త సమయం పడుతుందని, ఈ నేపథ్యంలోనే టికెట్స్ ఇంకా ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో జీవో జారీ అయ్యే అవకాశం ఉందని, జీవో జారీ అయిన వెంటనే తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మీడియాకు కూడా ఈరోజు రాత్రికి షో వేసే అవకాశం అయితే కనిపిస్తోంది.
