AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్

Ak47 (2)

Ak47 (2)

AK47 : విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టిని పరిచయం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు కుటుంబంలోని మరొక క్యారెక్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈసారి వెంకటేష్ కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో యువ నటి యువినా పార్థవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

కొత్త ప్రోమోలో వెంకటేష్, రఘుబాబు ఇంటి విషయాలపై మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అదే సమయంలో ఉత్సాహంగా లోపలికి వచ్చిన సంపూర్ణ, తాను మరోసారి ప్రేమలో పడ్డానని చెబుతుంది. వెంటనే ఏదో ఊహించిన చిట్టిబాబు, ఈసారి కారు డ్రైవర్ తోనా ? లేదా మెకానిక్‌తోనే ప్రేమలో పడ్డావా ? అని సరదాగా ప్రశ్నిస్తాడు. ఆమె అవుననే సమాధానం చెప్పడంతో ఈ గ్లింప్స్ నవ్వులు పూయించేలా ముగుస్తుంది. ఒక్కో గ్లింబ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇంట్లో ఎప్పుడూ కొనసాగే గందరగోళాన్ని చమత్కారంగా చూపించడంతో ప్రేక్షకులు కూడా ఈ గ్లింప్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వెంకటేష్, శ్రీనిధి శెట్టి పాత్రల ప్రోమోలు ఆకట్టుకోగా, ఇప్పుడు సంపూర్ణ పాత్ర కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి కొత్త గ్లింప్స్‌తో సినిమా వినోదంగా ఉండబోతోందనే నమ్మకాన్ని మేకర్స్ మరింత స్ట్రాంగ్ గా చూపిస్తున్నారు.

ఇక ఈ మూవీలో వెంకటేష్, శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, దర్శకత్వం అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరుసగా విడుదలవుతున్న గ్లింప్స్ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చాయి. ఇంకా మిగిలిన ఫ్యామిలీ సభ్యుల పాత్రలను కూడా ఇదే తరహాలో పరిచయం చేయనున్నట్లు చిత్ర బృందం సంకేతాలు ఇస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.