NTV Telugu Site icon

Thunivu: తగ్గేదే లే అంటున్న అజిత్… బాక్సాఫీస్ వార్ కి రెడీ

Thunivu

Thunivu

తల అజిత్ కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫ్యాన్ బేస్ కలిగిన ఈ జనరేషన్ స్టార్ హీరో అయిన అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. బ్యాడ్ మెన్స్ గేమ్, బ్యాంక్ హీస్ట్ జోనర్ లో ‘తునివు’ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ గా ‘హెచ్ వినోద్’ తెరకెక్కించాడు. సంక్రాంతి సీజన్ లో తునివు సినిమా రిలీజ్ అయ్యే సమయంలో మరో స్టార్ హీరో అయిన విజయ్ నటిస్తున్న ‘వారిసు’ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. విజయ్- అజిత్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటే కోలీవుడ్ లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దీన్ని కాస్త తగ్గించడానికి, బాక్సాఫీస్ క్లాష్ ని అవాయిడ్ చేస్తూ జనవరి 11న అజిత్ తునివు సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయ్ వారిసు సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది అనుకున్నారు. అయితే ఏం అయ్యిందో తెలియదు, సడన్ గా ప్లాన్ ఎందుకు మారిందో అర్ధం కాలేదు కానీ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని కూడా జనవరి 11నే రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలని ఒకే రోజు దిల్ రాజునే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. వారిసు సినిమా జనవరి 11న వస్తున్నట్లు దిల్ రాజు అఫీషియల్ గా చెయ్యడంతో ‘తునివు’ సినిమా వాయిదా పడుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే ఆల్రెడీ క్లాష్ ని అవాయిడ్ చెయ్యడానికి అజిత్ సినిమా జనవరి 11కి రిలీజ్ చేస్తున్నాం, మళ్లీ వాయిదా వేస్తే సినిమా బజ్ దెబ్బ తింటుంది, పైగా విజయ్ కి భయపడి అజిత్ సినిమాని వాయిదా వేశారు అనే కామెంట్స్ ని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. ఇది తునివు సినిమా కలెక్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే విజయ్ సినిమా జనవరి 11న వచ్చినా, అజిత్ మాత్రం వెనక్కి తగ్గకుండా క్లాష్ కే సై అంటున్నాడు. ఇది భారి బాక్సాఫీస్ ఫైట్ కి కారణం అయ్యేలా ఉంది. మరి జనవరి 11న కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో చూడాలి.

Show comments