Site icon NTV Telugu

Indraja: హీరోయిన్ గా ఇంద్రజ.. ఈ వయసులో కూడా తగ్గకుండా!

Cm Pellam Movie

Cm Pellam Movie

CM Pellam movie Openeing: నటుడు అజయ్ హీరోగా, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని అధికారికంగా వెల్లడించారు. సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్న ఈ సినిమాలో హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నగేష్, కోటేశ్వర రావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Saindhav: సైకోగా వెంకటేష్.. అందుకే ఆ పేరు పెట్టానంటున్న శైలేష్ కొలను!

ప్రిన్స్ హనీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డీఓపీ నాగ శ్రీనివాసరావు అందిస్తున్నారు. వాకాడ అంజన్ కుమార్ నిర్మాణ సారథ్యంలో నిర్మాత బొల్లా రామకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఇంద్రజ మాట్లాడుతూ ఈరోజు సీఎం పెళ్లాం – కామన్ మ్యాన్ పెళ్ళాం అనే సినిమా ఓపెనింగ్ జరిగిందని అన్నారు. సొసైటీకి చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఇస్తున్న మూవీ ఇది, సోల్ ఫుల్ గా తీయాలని ప్రయత్నిస్తామని, త్వరలోనే మీ ముందుకు వస్తామని ఇంతకు ముందు లానే మమ్మలని ఆదరించండి అని అన్నారు. ఇక డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఇది వెరైటీ సినిమా అని కానీ చూసాక ప్రేక్షకులే చెబుతారు ఇది వెరైటీ సినిమా అని, డిఫరెంట్ యాంగిల్ లో పొలిటికల్ పాయింట్స్, నిజంగా ఒక పదేళ్ళ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనేవి భిన్నమైన కోణంలో చూపేందుకు ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

Exit mobile version