NTV Telugu Site icon

Ajay Devgn: సింగం సాబ్… ఈ పోస్టర్ ఫ్యాన్ మేడ్ లా ఉంది

Ajay Devgn

Ajay Devgn

బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి కాంబినేషన్ కి ఫ్లాప్ అనేదే తెలియదు. కామెడీ, యాక్షన్… ఇలా ఏ జానర్ లో సినిమాలు చేసినా హిట్ కొట్టడం తప్ప అజయ్ దేవగన్-రోహిత్ శెట్టి కనీసం యావరేజ్ ని కూడా ఇవ్వలేదు. ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరి నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా సింగం అగైన్. సింగం ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యి సింగం మూడో పార్ట్ కోసం ఆడియన్స్ ని వెయిట్ చేయించాయి. ఆడియన్స్ వెయిటింగ్ ని ఎండ్ కార్డ్ వేస్తూ సింగం థర్డ్ పార్ట్… సింగం అగైన్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. 2024 ఆగస్టు 15న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సింగం అగైన్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోణే, కరీనా కపూర్ ఖాన్… సింగం అగైన్ సినిమాలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లోనే అతిపెద్ద సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. సింగం సాబ్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. అతనో డేంజర్… త్వరలో సింగం రోర్ వింటారు అంటూ సింగం అగైన్ పోస్టర్ బయటకి వచ్చింది. సింహం, అజయ్ దేవగన్ ఫేస్ లని ఎడిట్ చేసి ఈ పోస్టర్ ని క్రియేట్ చేసిన ఈ పోస్టర్ లో క్వాలిటీ లేదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లే సూపర్బ్ గా ఉంటున్న ఈ కాలంలో ఫ్యాన్ మేడ్ తక్కువ క్వాలిటీతో పోస్టర్ ని ఎలా డిజైన్ చేసి బయటకి వదిలారో సింగం అగైన్ మేకర్స్ కే తెలియాలి. ఇదే సినిమా క్వాలిటీ అయితే సింగం అగైన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం గ్యారెంటీ.