దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమాని అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ కూడా చేశాడు. మార్క్ 30న థియేటర్స్ లోకి వచ్చిన భోలా సినిమా హిందీలో మిక్స్డ్ టాక్ రాబట్టింది కానీ మాస్ ఆడియన్స్ ని మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న అజయ్ దేవగన్, తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేసాడు. ఇండియన్ ఫుట్ బాల్ టీం మాజీ ప్లేయర్ అండ్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ బయోపిక్ గా ‘మైదాన్’ సినిమా తెరకెక్కింది.
పాన్ ఇండియా రేంజులో రూపొందిన ఈ మూవీ జూన్ 23న ఆడియన్స్ ముందుకి రానుంది. గతేడాది జూన్ లోనే రిలీజ్ అవ్వాల్సిన మైదాన్ సినిమా అనివార్య కారణాల వలన డిలే అవుతూ ఫైనల్ గా ఈ జూన్ లో రిలీజ్ అవుతోంది. అమిత్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అజయ్ దేవగన్ కి చాలా హోప్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ జోనర్ సినిమాలకి బౌండరీలు ఉండవు, ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ జరిగిపోతుంది. ఇలాంటి మ్యాజిక్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ లైఫ్ లో చాలానే ఉంది. వృత్తి పరంగా టీచర్ అయిన ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ ఇండియన్ ఫుట్ బాల్ టీంలో ఒకప్పుడు ప్లేయర్, ఆ తర్వాత 1950 నుంచి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించాడు.
‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ కోచ్ గా ఉన్న సమయం ఇండియన్ ఫుట్ బాల్ హిస్టరీలోనే గోల్డెన్ ఫేజ్ గా చెప్పుకోవచ్చు. ఒలంపిక్స్ లో ఆషియా నుంచి సెమిస్ చేరిన మొదటి టీంగా ఇండియ హిస్టరీ క్రియేట్ చేసింది. 1951, 1962లో ఏషియన్ చాంపియన్షిప్ లో ఇండియా గోల్డ్ మెడల్స్ ని కూడా గెలిచింది. ‘ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియన్ ఫుట్ బాల్’ గా పేరు తెచ్చుకున్న ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ పాత్రలో అజయ్ దేవగన్ అద్భుతంగా నటించాడని ఇప్పటికే బాలీవుడ్ కథనాలు ప్రచురించింది. ఈ విషయాన్ని నిజం చేస్తూ మైదాన్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. షూ కూడా లేకుండా ఇండియన్ టీం ఫుట్ బాల్ ఎలా ఆడింది? అజయ్ దేవగన్ టీం మెంబర్స్ ని ఎలా మోటివేట్ చేశాడు అనే ఎలిమెంట్స్ ని చూపిస్తూ కట్ చేసిన టీజర్ మైదాన్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. మరి జూన్ 23న అజయ్ దేవగన్, కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ కథతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
