NTV Telugu Site icon

Mercy Killing: హీరోయిన్ గా జబర్దస్త్ భామ.. “మెర్సి కిల్లింగ్” చేయమంటోంది!

Mercy Killing First Look Launched

Mercy Killing First Look Launched

Aishwarya Vullingala Mercy Killing first look launched by hero Akash Puri: జబర్దస్త్ భామ ఐశ్వర్య ఉల్లింగల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన “మెర్సి కిల్లింగ్”సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య ఉల్లింగల, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్ హరియల, మాధవి తాళాబత్తుల నిర్మిస్తున్న ఈ మెర్సి కిల్లింగ్ సినిమాని వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నట్టు వెల్లడించారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా విడుదల చేశారు.

Vijay Sethupathi-Vote: మత రాజకీయాలు చేసే వారికి ఓటు వెయ్యొద్దు.. విజయ్ సేతుపతి వీడియో వైరల్!

ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ మెర్సి కిల్లింగ్ టైటిల్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంది, మోషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో షూట్ చేశారని అన్నారని, ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని అన్నారు. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్. స్వేచ్ఛ అనే అనాథ బాలిక తనకు న్యాయం చేయమని కోరడంతో ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show comments