Aishwarya Rai Bachchan: చిత్ర పరిశ్రమలో గాసిప్స్ కు కొదువేమి లేదు. పెళ్లి కాకుండా వేరొక హీరోతో కనిపిస్తే వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇక పెళ్లి తరువాత కొద్దిగా లావు అయినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి పుకార్లు సర్వ సాధారణం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, అమితాబ్ ఇంటి కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ మళ్లీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అభిషేక్, ఐశ్వర్య కు ఇప్పటికే ఆరాధ్య అనే కూతురు ఉంది. ఆమె వయస్సు10 ఏళ్లు. ఇప్పటికే కూతురు చేయిని ఐశ్వర్య వదలదని, ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వడంలేదని ట్రోలర్స్ ఐష్ పై విరుచుకు పడుతున్నారు. తాజాగా మరోసారి ఐష్ ఇలాంటి ట్రోల్స్ కే గురయ్యింది. పదేళ్లు వచ్చిన కూతురు చేయి పట్టుకొని ఎయిర్ పోర్ట్ లో లాక్కెళ్ళుతూ కనిపించింది. దీంతో నెటిజన్స్ ఆమెకు ఫ్రీడమ్ లేకుండా పోయిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక దీంతో పాటు మరో విషయాన్నీ కూడా నెటిజన్స్ గుర్తించారు. అదేంటంటే ఐష్ మరోసారి తల్లి కాబోతుందని.. అలా అనుమానించడానికి కూడా కారణం లేకపోలేదు.. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఐష్ పొట్ట భాగాన్ని కవర్ చేసుకోవడానికిప్రయత్నిస్తు కనిపించింది. అంతేకాకుండా ఆమె పొట్ట కొద్దిగా ఉబ్బి కనిపించడంతో మరోసారి ఐష్ ప్రెగ్నెంట్ కానున్నదని వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఈ వార్తలను మరికొంత మంది కొట్టిపారేస్తున్నారు. ఈ వయస్సులో ఐష్ మళ్లీ తల్లి కాబోతుందా..? అలాంటిదేమి అయ్యి ఉండదు. అనవసరమైన ఊహాగానాలు ఎందుకు.. ఏదైనా ఉంటే బచ్చన్ ఫ్యామిలీ చెప్తుంది కదా ..? అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా గత రెండు రోజుల నుంచి ఐష్ ప్రెగ్నెన్సీ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వార్తలకు ఐష్ ఎలా చెక్ పెట్టనుందో చూడాలి.
