మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గని”. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న “గని” ఆహాలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘గని’ గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు OTT చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారట. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ‘ఆహా’ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రొడ్యూసర్స్ కట్ వెర్షన్ లో విభిన్న స్క్రీన్‌ప్లేతో పాటు, థియేటర్ వెర్షన్ లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను యాడ్ చేయబోతున్నారట. దీంతో మూవీ నిడివి మరో 10 నిమిషాలకు పైగా పెరుగుతుందని సమాచారం.
Read Also : VD11 : విజయ్ దేవరకొండ, సామ్ మూవీ గ్రాండ్ లాంచ్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, జగపతి బాబు, నవీన్ చంద్ర తదితరులు కూడా ఈ స్పోర్ట్స్ డ్రామాలో కీలకపాత్రలు పోషించారు. ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ‘గని’ని తమన్ సంగీతం అందించారు. మరి ప్రొడ్యూసర్స్ కట్ వెర్షన్ తోనైనా ‘గని’ మెగా అభిమానులను అలరిస్తాడేమో చూడాలి.
