Site icon NTV Telugu

Manchu’s Family: మోహన్ బాబు, మంచు లక్ష్మీ ‘అగ్నినక్షత్రం’

Mohan Manchu Agni Nakshatra

Mohan Manchu Agni Nakshatra

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే పేరు ఖరారు చేశారు. విలక్షణ నటుడు సముతిర కని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ ఇతర ప్రధాన పాత్రలుప పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది.

ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. ఈ సందర్భంగా రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందిందని అర్థం అవుతోంది. సిద్దిక్ విలన్ గా నటించగా, చైత్ర శుక్ల కీలక పాత్రను పోషించింది. చిత్రానికి లిజో కె జోస్ సంగీతం సమకూర్చగా, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

Exit mobile version