NTV Telugu Site icon

Agent Trailer: వైల్డ్ సాలా ఏజెంట్ వచ్చేశాడోచ్..

Agnet

Agnet

Agent Trailer: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకినాడలో ఘనంగా జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అఖిల్ వైల్డ్ లుక్ అయితే అభిమానులను పిచ్చెక్కిస్తోంది అని చెప్పొచ్చు.

Aarti Mittal: వారితో వ్యభిచారం చేయిస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్.. అరెస్ట్

” నువ్వెందుకు ఏజెంట్ అవ్వాలి అనుకుంటున్నావు” అన్న ప్రశ్నతో ట్రైలర్ మొదలయ్యింది. ట్రైలర్ ను ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఒక సిండికేట్ బ్యాంక్ కు ఒక ఔర్ హౌస్ ఉంటుంది.. దాన్నీ గాడ్ అంటారు.. దాన్ని ట్రేస్ చేయగలిగితే మొత్తం నెట్ వర్క్ ను నాశనం చేయొచ్చు అని విలన్స్ ప్లాన్ చేస్తారు. వారిని ఆపడానికి మమ్ముట్టి అండ్ టీమ్ రంగంలోకి దిగుతారు. అలాంటి సింహాలు ఉన్న బోనులోకి కోతి లాంటి హీరోను పంపితే .. ఎలాగైనా బయటికి రాగలడు అని ఆలోచించిన మమ్ముట్టి.. ఈ మిషన్ ను ఏజెంట్ అఖిల్ కు అప్పగిస్తాడు. ఇక కోతి లాంటి బిహేవియర్ ఉన్న అఖిల్..గన్స్ తో ఒక ఆట ఆడేసుకుంటాడు. ఇక ఒకానొక సమయంలో అఖిల్ నే మమ్ముట్టి కాల్చి చంపేయమని చెప్తాడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అసలు అఖిల్ ఆ మిషన్ ను ఎలా పూర్తి చేశాడు..? అనేది కథగా తెలుస్తుంది. ఇక ఏజెంట్ కథలో ప్రేమ కొద్దిగానే ఉన్నా అది కూడా ప్రాముఖ్యత ఉన్న కథలానే కనిపిస్తుంది. అఖిల్ రెండేళ్లు కష్టపడి పెంచిన బాడీ, హెయిర్ సినిమాలో బాగా ఇంపాక్ట్ చూపించాయని చెప్పాలి. వైల్డ్ ఏజెంట్ గా అఖిల్ లుక్ మాత్రం అదిరిపోయింది. రెండు మూడు డైలాగ్స్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ ఆకట్టుకొంటుంది. మొత్తానికి వైల్డ్ సాలా ఏజెంట్ ను చూపించి మరింత హైప్ పెంచేశారు మేకర్స్. మరి ఏప్రిల్ 28 న ఈ ఏజెంట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.