టాలీవుడ్ యువహీరో అక్కినేని అఖిల్ చాలా కాలం నుంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ కొంత మేరకు విజయాన్ని సాధించింది. ఇందులో లవర్ బాయ్‌గా అఖిల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా రానున్న ‘ఏజెంట్’ రూపంలో సూపర్ హిట్ ఫిల్మ్ రాబోతోందని అక్కినేని అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఏజెంట్’ చిత్రబృందం అభిమానులకు ఓ శుభవార్త తెలిపింది. త్వరలోనే ఏజెంట్ టీజర్ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 05:05 గంటలకు టీజర్‌ను విడుదల చేసే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
Agent: అఖిల్‌తో ‘స్పెషల్’ చిందులేయనున్న క్రేజీ బ్యూటీ?
స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందించినట్లు తెలుస్తోంది. కాగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో తొలి కమర్షియల్ విజయం అందుకున్న అఖిల్, ఏజెంట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తీవ్ర కసరత్తు చేసి, కండలు భారీగా పెంచాడు. ఇందులో అతడు రెండు వేరియేషన్స్ ఎలివేట్ అయ్యేలా రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్‌లో కనిపించనున్నాడట! సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ తేదీని ఖరారు చేసినట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఇవాళ సాయంత్రం 5.05 గంటలకు టీజర్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని ప్రకటించింది.
