Again Death Threats to Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంగళవారం మరోసారి బెదిరింపు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను సమీక్షించారు. వరుసగా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని నిర్ధారించుకోవడానికి సల్మాన్ భద్రతను సమీక్షించారని పేర్కొన్నారు. పోలీసులు సల్మాన్‌ను సంప్రదించి, ఆయన భద్రతకు సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి వై ప్లస్ భద్రతను కల్పిస్తున్నారు. ఆదివారం ఉదయం, కెనడాలోని గిప్పీ గ్రెవాల్ ఇంటి వెలుపల జరిగిన కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు బిష్ణోయ్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రకటించారు.
Shahrukh Khan: కింగ్ ఆఫ్ బాలీవుడ్… రొమాన్స్‌కి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడా?
ఇండియా టుడేలో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ ఫేస్ బుక్ అకౌంట్ వేరే దేశం నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో “మీరు సల్మాన్ ఖాన్‌ను సోదరుడిగా భావిస్తారు, కానీ ఇప్పుడు మీ సోదరుడు వచ్చి మిమ్మల్ని రక్షించే సమయం వచ్చింది. ఈ సందేశం కూడా సల్మాన్ ఖాన్ కోసమే, సల్మాన్ అండర్వరల్డ్ డాన్ దావూద్ మిమ్మల్ని రక్షిస్తాడనే భ్రమలో ఉండకండి; నిన్ను ఎవరూ రక్షించలేరు. సిద్దు మూసే వాలా మృతిపై మీ నాటకీయ స్పందన ఎవరూ పట్టించుకోలేదు. అతను ఎలాంటి వ్యక్తి, అతను కలిగి ఉన్న నేర సంఘాల గురించి మనందరికీ తెలుసు… మీరు ఇప్పుడు మా రాడార్‌లోకి వచ్చారు. దీనిని ట్రైలర్‌గా పరిగణించండి; పూర్తి సినిమా త్వరలో విడుదల కానుంది, మీరు కోరుకున్న ఏ దేశానికి అయినా పారిపోండి, కానీ గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు; అది ఆహ్వానం లేకుండా వస్తుంది.” అని అంటూ హెచ్చరించారు. మార్చిలో, సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు పంపిన ఒక బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి బయట భద్రతను పెంచారు.