Bigg Boss Revanth: బిగ్‌బాస్ 6 ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్‌బాస్-6 విన్నర్‌గా రేవంత్ నిలిచాడు. గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచిన రేవంత్.. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో అతడి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అంచనాలకు భిన్నంగా బిగ్‌బాస్-6 ఫినాలే సాగింది. నాటకీయ పరిణాామాల కారణంగా విన్నర్ రేవంత్ కంటే రన్నరప్ శ్రీహాన్ అత్యధిక క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షల నగదు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ మాత్రం రూ.40 లక్షల నగదు సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రేవంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు క్యాష్ ప్రైజ్ తక్కువ రావడంతో అన్యాయం జరిగిందని.. కానీ రేపు తనకు న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకంతో ఉన్నానని చెప్పాడు. తనకు ప్రజల సపోర్ట్ ఉంటుందని ఊహించానని.. అందుకే క్యాష్ ఆఫర్ చేసినప్పుడు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు రేవంత్ స్పష్టం చేశాడు.
Read Also: Veera Simha Reddy: ఈ ఒక్క పాటతో తమన్ కి ఫుల్ బిర్యానీ పెట్టేయొచ్చు…
తాను ఇచ్చిన మాట ప్రకారమే డబ్బు తీసుకోలేదని.. కానీ శ్రీహాన్ తొలుత డబ్బు తీసుకోనని చెప్పాడని.. తనకు ఏం అవసరాలు ఉన్నాయో కానీ డబ్బు తీసుకున్నాడని రేవంత్ అన్నాడు. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చని.. కానీ బిగ్‌బాస్ విన్నర్ మాత్రం కాలేమన్నాడు. తాను రెండు, మూడు షోలు చేస్తే తిరిగి ఆ డబ్బును సంపాదించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. తనకు తన కూతురు లక్కీ ఛార్మ్ అని.. ఆమె పుట్టగానే తనకు విన్నర్ ట్రోఫీ వచ్చిందని రేవంత్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు హౌస్‌లో గీతూ త్వరగా ఎలిమినేట్ అవుతుందని అసలు ఊహించలేదన్నాడు. ఆమె రివ్యూవర్ కాబట్టి బిగ్‌బాస్ షో గురించి బాగా అవగాహన ఉంటుందని భావించామని.. కానీ ఆమె హౌస్‌లోని కంటెస్టెంట్లతో అలా ఆడాలి.. ఇలా ఆడాలని చెప్పడం జనాలకు నచ్చలేదని.. అందుకే ఆమెకు ఓట్లు పడలేదని రేవంత్ చెప్పాడు.
Read Also:Pooja Hegde: మేడమ్ మీరు కాస్త ప్యాంట్స్ వేసుకోండి… ప్లీజ్
అటు రాజ్ మంచి కంటెస్టెంట్ అని.. అతడు ఎవిక్షన్ పాస్ ద్వారా ఎలిమినేట్ కాకపోయి ఉంటే టాప్-3లో ఉండేవాడని రేవంత్ అన్నాడు. రాజ్ ఉంటే తనకు టిక్కెట్ టు ఫినాలే రేసులో టఫ్‌గా ఉండేదని చెప్పాడు. టాస్కుల్లో తన మీద తనకు చాలా నమ్మకం ఉండేదని.. అందుకే ప్రతి టాస్కులో తాను గెలవడానికే ప్రయత్నించేవాడినని రేవంత్ తెలిపాడు. తన నమ్మకమే తనకు స్ట్రాంగ్ అయ్యిందన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తాను తన లాగానే ఉన్నానని.. అందుకే గెలిచానని.. గతంలో ఇండియన్ ఐడల్‌లోనూ తన లాగానే ఉన్నానని గుర్తుచేశాడు. తానేంటో తనకు తెలుసు అని.. నెగిటివ్ కామెంట్లను తాను ఎక్కువగా పట్టించుకునేవాడిని కాదన్నాడు. జీవితంలో తనకు బిగ్‌బాస్ ఒక యాడ్ ఆన్ మాత్రమే అని రేవంత్ చెప్పాడు.
బిగ్‌బాస్‌లో తనకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అంటే రాజ్, ఆదిరెడ్డి, వాసంతి, శ్రీహాన్, శ్రీసత్య అని రేవంత్ చెప్పాడు. తనకు బిగ్‌బాస్ షోకు వెళ్లకముందు ఇనయా, సూర్య, చలాకీ చంటి, బాలాదిత్య తెలుసు అని.. రోహిత్‌తో కలిసి క్రికెట్ ఆడినా తాము మాట్లాడుకోలేదని రేవంత్ స్పష్టం చేశాడు. ఆదిరెడ్డి చాలా కష్టపడి బిగ్‌బాస్ షోలోకి వచ్చాడని.. అతడు అందరికీ ఇన్‌స్పిరేషన్ అని రేవంత్ అన్నాడు. మనకు తొలుత ఎవరు నెగిటివ్‌గా అనిపిస్తారో వాళ్లే తర్వాత మిత్రుడు అవుతారని.. తనకు ఆదిరెడ్డి విషయంలో ఇదే జరిగిందని రేవంత్ వివరించాడు. ఆదిరెడ్డికి, తనకు ఎన్నో పోలికలు ఉన్నాయని తెలిపాడు. ఆదిరెడ్డి జెన్యూన్ పర్సన్ అని స్పష్టం చేశాడు. అటు ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రత్యేకంగా ఆదిరెడ్డికి కాల్ చేసింది. ఈ సందర్భంగా రేవంత్‌కు ఉన్న కసి యూత్‌లో ఉంటే ఏదైనా సాధిస్తారని ఆదిరెడ్డి చెప్పాడు. హౌస్‌లో ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్లు మాత్రమే చెప్తామని.. కానీ రేవంత్‌లో ఎన్నో పాజిటివ్ పాయింట్లు ఉన్నాయని చెప్పాడు.