Prabhas : ఈ నడుమ టాలీవుడ్ స్టార్ హీరోలతో తమిళ హీరోలు పోటీ పడుతున్నారు. తెలుగులో మన హీరోల సినిమాలకు పోటీగా వాళ్ల సినిమాలను దింపి దెబ్బకొడుతున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాకు పోటీగా రజినీకాంత్ నటించని కూలీ వచ్చింది. రెండు సినిమాలు ఆగస్టు 14న రాగా వార్-2 కలెక్షన్లపై కూలీ దారుణమైన దెబ్బ కొట్టింది. రెండు సినిమాల టాక్ యావరేజ్ అయినా.. కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల వార్-2కు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఒకవేళ కూలీ సినిమా లేకపోయి ఉంటే వార్-కు అంత తక్కువ కలెక్షన్లు వచ్చేవి కావేమో. ఇప్పుడు ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ తో దళపతి విజయ్ నటించిన జననాయగన్ మూవీ పోటీ పడుతోంది.
Read Also : Janhvi Kapoor : అతనితో నాకు మ్యారేజ్ అయింది.. జాన్వీకపూర్ భారీ ట్విస్ట్
రెండు సినిమాలో 2026 జనవరి 9న రిలీజ్ అవుతున్నాయి. అంటే మళ్లీ తెలుగు హీరోతో తమిళ హీరో పోటీ అన్నమాట. విజయ్ సినిమా తమిళం, తెలుగులో భారీ బిజినెస్ చేయనుంది. కానీ ప్రభాస్ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ తో వస్తోంది. వార్-2 ను కూలీ దెబ్బ కొడితే.. ఇప్పుడు విజయ్ జననాయగన్ ను ప్రభాస్ రాజాసాబ్ దెబ్బ కొట్టాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రభాస్ సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి యునానిమస్ గా తెలుగు ప్రేక్షకులు ప్రభాస్ కే ఓటేసే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దళపతిని తక్కువ అంచనా వేయలేం. ఆయన సినిమాలకు తెలుగులోనూ భారీగా వసూళ్లు వస్తాయి. కానీ భారీ హిట్ టాక్ వస్తేనే ఈ సారి ప్రభాస్ ను తట్టుకుని విజయ్ నిలబడగలడు. రాజాసాబ్ కు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా విజయ్ సినిమా కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.
Read Also : Tollywood : ప్లాపుల్లో టాలీవుడ్.. ఆ ముగ్గురు ఆదుకుంటారా..?
