Hit-2 Urike Urike Full Song: అడవిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నాని సమర్పణలో శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్న చిత్రం ‘హిట్ 2’. ఈ దర్శకనిర్మాతలు తీసిన ‘హిట్’ సినిమా సక్సెస్ కావటంతో ఇప్పుడు ‘హిట్ 2’తో మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై కొంత మేరకు అంచనాలు పెంచింది. అయితే అడల్ట్ కంటెంట్ ఉందనే కారణంతో యు ట్యూబ్ ఈ టీజర్ ను ఆపేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘ఉరికే ఉరికే’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.
Read also: Maoists Mulugu District: వ్యక్తిని దారణంగా చంపిన మావోయిస్టులు.. ఇన్‌ఫార్మర్ అంటూ లేఖ
హైదరాబాద్ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాల – ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఎన్ ఆర్ కాలేజీ విద్యార్థుల సమక్షంలో ‘హిట్ 2’ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఈ పాటలో అడివి శేష్, మీనాక్షీ చౌదరి మధ్య చక్కటి కెమిష్ట్రీని చూడవచ్చు. ప్రత్యేకించి బెడ్ రూమ్ సీన్స్, లిప్ లాక్స్ యూత్ ని ఆకట్టుకునేలా సాగాయి. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. శ్రీలేఖ చక్కటి మెలోడీతో రావటం గమనించవచ్చు. ఈ మెలోడికి గీత రచయిత కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించగా… సిద్ శ్రీరామ్ పాడారు. ఈ ‘ఉరికే ఉరికే’ పాట వినగానే ఆకట్టుకునేలా ఉండటంతో త్వరగానే ట్రెండ్ లోకి వెళ్ళటం ఖాయం. మరి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలీ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు జాన్ స్టీవర్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా మణికందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మరి ‘హిట్’ లాగనే ఈ ‘హిట్ 2’ కూడా విజయం సాధిస్తుందేమో చూద్దాం.
Pan Fried Chicken: చికెన్ తక్కువ.. ప్రొటీన్ ఎక్కువ..