NTV Telugu Site icon

Adivi Sesh: ‘ఎంతవారు గాని’ టీజర్ ఆవిష్కరించిన అడివి శేష్!

Niwaas

Niwaas

Enthavaaru Gaani: ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ దగ్గర ఎడిటర్ గా, సౌండ్ ఇంజనీర్ గా ఎంతో కాలం పనిచేశారు ఎన్. శ్రీనివాస్. ఆయన దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా ‘ఎంతవారు గాని’ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించారు. సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ ను ప్రముఖ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

కేవలం ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ‘ఎంతవారు గాని’ మూవీ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పాడు దర్శకుడు శ్రీనివాస్. ప్రయోగాలు చేయడానికి ఎంతకైనా తెగించిన ఓ యువతి చేసిన పొరపాటు ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులను ఎంత ప్రమాదంలోకి నెట్టిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు ఈ టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉందనే విషయం ఈ వీడియో ద్వారా వెల్లడించారు. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. గతంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర ‘రంగీలా’ చిత్రానికి ఎడిటర్ గానూ, ఆ తర్వాత అనేక చిత్రాలకు సౌండ్ ఇంజనీర్ గానూ శ్రీనివాసన్ పనిచేశారు. ఆయన ప్రతిభ ఈ టీజర్ లో తెలుస్తోంది. ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు విజయ్ కురాకుల స్వరాలు సమకూర్చారు. జ్ఞాని నేపథ్య సంగీతం అందించారు.