Aditi Rao Hydari Interview About Anarkali Role: అదితి రావు హైదరీ ‘అనార్కలి’ పాత్రలో నటించిన పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్‌ఫుల్ స్ట్రీమ్ అవుతోంది. మార్చి 3వ తేదీన రిలీజైన ఈ వెబ్ సిరీస్.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది.ఈ నేపథ్యంలోనే పలు ఆసక్తికరమైన విషయాల్ని అదితిరావు హైదరి పంచుకున్నారు. తొలుత ఈ పాత్ర తన దగ్గరకు వచ్చినప్పుడు, తాను చేయగలనా? లేదా? అని ఆలోచించానని.. అయితే దర్శకులు తనపై నమ్మకం ఉంచినందుకు చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది. ఏ పాత్ర అందరూ అనుకున్నంత సులభమైతే కాదని, తెలుగులో తాను నటించిన సమ్మోహనం మూవీలోని పాత్ర కూడా చాలా చాలెంజింగ్‌గా ఉండిందని పేర్కొంది. ఏదో పాత్ర ఉంది కదా చేసేద్దాం అనే కోణంలో కాకుండా.. దాన్ని మనం పూర్తిగా స్వీకరించి స్క్రీన్ పైన ప్రెజంట్ చేసినప్పుడు ప్రజల హృదయాల్లో చాలా రోజులపాటు గుర్తుండిపోతామన్నారు. అనార్కలి పాత్ర ఓ చారిత్రాత్రక రోల్ కావడంతో.. అది తనకు నాకు పూర్తిగా చాలెంజింగ్‌గా అనిపించిందన్నారు.
Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?
ఈ అనార్కలి పాత్ర అమాయకంగా, నిర్భయంగా కనిపిస్తూనే.. మానవతను చూపిస్తుందని అదితి పేర్కొంది. ఎవరైనా ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నిస్తే.. ఆమె వారికి భయంతో దూరంగా వెళ్లిపోతుందని తెలిపింది. ఆ పాత్రలో స్వచ్ఛత ఉంటుందని, నమ్మకాలపై గట్టి అభిప్రాయంతో ఉంటుందని, అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉండటం వల్లే ఆ పాత్ర చేయటానికి తనని ఎగ్జైట్ అయ్యేలా చేశాయని చెప్పింది. అనార్కలి సుతిమెత్తనైన మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, ఆమెకు ఆమే అందమైన భూషణమని, అందుకే ఆమె చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందని వెల్లడించింది. ఈ పాత్రలో నటించడం వల్ల.. ప్రేమను మించి శక్తివంతమైన అంశం ఇంకోటి ఉండద్న అంశాన్ని అర్థం చేసుకోగలిగానని తెలిపింది. అంజు మోడీ తన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారంది. ఆ డిజైన్స్ చాలా బాగున్నాయని, తాను ధరించిన ప్రతీదీ ఒరిజినల్ జువెలరీనే అని చెప్పుకొచ్చింది. నసీరుద్దీన్‌షాతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆయన సెట్‌లో చిన్న పిల్లాడిలా అందరితో కలిసిపోయారంది. తాను తన పట్ల దయతో ఉండనని, ఎల్లప్పుడూ కఠినంగానే వ్యవమరిస్తుంటాని కుండబద్దలు కొట్టింది.
Swapnalok Fire Accident: స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదానికి కారణమిదే.. తేల్చిన అధికారులు
ఎప్పటికప్పుడు తనని తాను నేను బెటర్‌గా చూసుకోవడం కోసం.. తన నటనను, పనితీరును పరిశీలించుకుంటానని అదితి పేర్కొంది. తనకు మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని తెలియజేసింది. తనకు బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా చర్చ మీద నమ్మకం లేదని.. తాను తమిళ సినిమాతో కెరీర్ మొదలుపెట్టానని తెలిపింది. తనకు తెలుగు, తమిళ్ బాగా అర్థమవుతాయని.. హిందీ కూడా బాగా మాట్లాడగలనని చెప్పింది. నటిగా ఇంకా చాలా చేయాలని అనుకుంటానని తన కోరికని వెలిబుచ్చింది. తనలో ఇంకా ప్రతిభ ఉందని ఎవరైనా భావిస్తే.. ఆనందంగా ప్రాజెక్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నానంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి చాలామంది రాస్తుంటారని, ప్రజలు తమపై చూపించే ఆదరాభిమానాలకు, ఆసక్తిని చూసి మురిసిపోతుంటానంది. అయితే.. అందరినీ అన్నీ వేళల్లో పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పింది. ఒకవేళ రేఖ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే.. అదొక గొప్ప అవకాశంగా భావిస్తానని అదితి చెప్పుకొచ్చింది.