NTV Telugu Site icon

Bigg Boss 6: ఆదిరెడ్డి ఓవరాక్షన్.. మాములుగా లేదుగా.. విన్నర్ అంట..!!

Adireddy

Adireddy

Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం హౌస్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో కెప్టెన్ ఫైమా తప్పితే అందరూ ఉన్నారు. దీంతో ఓటింగ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఖాళీ చెక్‌లు ఇచ్చారు. ఆ చెక్కులపై కొంత అమౌంట్ వేయాలని.. ఎవరైతే ఎక్కువ అమౌంట్ వేస్తారో వాళ్లు ఈ వారం ఇమ్యునిటీ పొంది సేవ్ అవుతారని చెప్పారు. అయితే ఈ మొత్తం విన్నింగ్ ప్రైజ్‌లో కట్ అవుతుందని బిగ్‌బాస్ వివరించాడు. కానీ ఓ షరతు కూడా పెట్టాడు. ఎవరితోనూ చర్చించకుండా అమౌంట్ వేయాలని.. ఒకవేళ ఎవరితోనైనా చర్చిస్తే డిస్ క్వాలిఫై అవుతారని హెచ్చరించారు.

Read Also: దివికేగిన ధృవ తారలు.. ముగిసిన తొలితరం సూపర్‌ స్టార్స్ శకం

ఈ టాస్కులో శ్రీసత్య అతి తెలివి ప్రదర్శించి తాను వేసిన అమౌంట్‌ను పరోక్షంగా శ్రీహాన్‌కు వెల్లడించడంతో బిగ్‌బాస్ ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. మరోవైపు ఆదిరెడ్డి ఓవరాక్షన్ చేశాడు. తాను విన్నర్‌‌ను అని.. తన డబ్బులో నుంచి తాను కట్ చేసుకోవడమేంటని.. ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాస్తారో వాళ్లు ఇంట్లో ఉండటానికి అర్హత లేదని అర్ధమని బిగ్‌బాస్‌కే లెక్చర్ ఇచ్చాడు. దీంతో అతడి ఓవరాక్షన్ చూసి ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. ఏదో కామన్ మ్యాన్ అన్న సానుభూతితో ప్రేక్షకులు ఓట్లు వేస్తుంటే ఆదిరెడ్డి కళ్లు నెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో, గేమ్ విషయంలో అతడు పూర్‌గా ఉన్నా ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే బెటర్ అన్న పాయింట్‌తో అతడికి ఓట్లు వేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అటు ఫుడ్ విషయంలో శ్రీహాన్, రేవంత్ మధ్య వాదన జరిగింది. ఈ వారం తనను రేవంత్ నామినేట్ చేద్దామనుకున్నాడని.. కానీ ఆదిరెడ్డి నామినేట్ చేయడంతో రేవంత్ చేయలేదంట అని శ్రీసత్య దగ్గర శ్రీహాన్ వాపోయాడు.