Adipurush Total Worldwide Theaters Count: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ అనే మైదలాజికల్ సబ్జెక్ట్ తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రఘురాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ సినిమాని తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్ సంస్థ ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించి తెరకెక్కించింది.
AAA Cinemas: సొంత మల్టీప్లెక్స్ లాంఛ్ చేసిన బన్నీ
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో కనిపిస్తూ ఉండడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల సైతం సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. తిరుపతిలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి తర్వాత ముంబైలో ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసిన సినిమా యూనిట్ ఆ తర్వాత పూర్తిగా మౌనం వహిస్తోంది, కానీ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా మీద మాత్రం విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7వేల థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అయితే ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని థియేటర్లు లో రిలీజ్ అవుతుందనే విషయం పరిశీలిద్దాం.
Koratala Siva : ‘దేవరా’ నీవే దిక్కయ్యా!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం 1100 థియేటర్లలో ఆది పురుష్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక కర్ణాటక వ్యాప్తంగా 185 థియేటర్లలో ఆది పురుష సినిమా రిలీజ్ అవుతుంటే తమిళనాడులో 170 థియేటర్లలో కేరళలో 150 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక హిందీ సహా మిగతా భారతదేశం అంతా కలిపి 3300 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ఒక్క ఓవర్సీస్ లోనే 2,100 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 7000 కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఇప్పటివరకు ఒక్క షో కూడా పడలేదు కానీ సినిమా మీద మాత్రం విపరీతమైన బజ్ ఏర్పడుతోంది.