NTV Telugu Site icon

Adipurush: రెండో రోజు నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన ఆదిపురుష్!

Adipurush Collections

Adipurush Collections

Adipurush 2nd Day Non RRR record in Telugu States: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడిన అనంతరం జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా వసూళ్ల విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తెలుగు సహా హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాని కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ముందు నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో మొదటిరోజు భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయని అందరూ భావించారు అందుకు తగ్గట్టుగానే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. ఒక్క తెలుగులోనే 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా దాదాపు 32 కోట్ల వరకు షేర్ కలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
Rashmika Mandanna: దారుణంగా మోసపోయిన రష్మిక.. క్షణాల్లో సంచలన నిర్ణయం!
ఇక తాజాగా రెండవ రోజు వసూళ్లు కూడా బయటకు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల వరకు షేర్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. 25 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా రెండో రోజు నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఆర్ఆర్ఆర్ కాకుండా మిగతా సినిమాల్లో ఈ సినిమా మొదటి స్థానం సంపాదించినట్లుగా తెలుస్తోంది. అంటే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా పక్కన పెడితే ఆ తర్వాత ఈ సినిమాకి అత్యధిక వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు లభించాయి అని చెబుతున్నారు. అంతే ఇక ఈ రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకి సంబంధించిన వసూళ్లు మరింతగా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా పూర్తి థియేట్రికల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

Show comments