Actress Vidya Murdered by Her Own Husband: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భజరంగీ’, ‘వేద’, ‘జై మారుతి 800’ సహా కొన్ని కన్నడ సినిమాల్లో సహాయ నటిగా నటించిన నటి విద్య దారుణ హత్యకు గురయ్యారు. విద్యను ఆమె భర్త నందీష్ స్వయంగా హత్య చేసి అదృశ్యమైనట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నటిగానే కాకుండా, విద్యా రాజకీయ నాయకురాలిగా కూడా ఫేమస్ అయ్యారు. మైసూర్ సిటీ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. నటి విద్య 2018లో నందీష్‌ని వివాహం చేసుకుంది. అయితే అప్పటి ఇద్దరి మధ్య తరచూ మనస్పర్థలు వచ్చేవి. తరచూ గొడవపడే ఈ జంట విడాకుల కోసం ప్రయత్నించేవారు కానీ తల్లిదండ్రులు తెలివిగా వారిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. అయితే ఇద్దరి మధ్య పోరు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండేది.
Getup Srinu: డైరెక్టర్ కానున్న మరో జబర్దస్త్ కమెడియన్.. సుధీర్ – గెటప్ శ్రీనులతో సినిమా?
ఇక ఇటీవల వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇక విద్య భర్త ఇల్లు మైసూరులోని తుర్గనూర్ కాగా ఆమె అక్కడి బెంగళూరులోని శ్రీరాంపూర్‌కు వచ్చింది. మే 20న నందీష్, విద్య మధ్య ఫోన్‌లో గొడవ జరిగింది. శ్రీరాంపూర్ నుంచి రాత్రికి రాత్రే తురగనూరు వెళ్లి విద్య గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో భర్త నందీష్ విద్యపై సుత్తితో దాడి చేశాడని చెబుతున్నారు. సుత్తితో కొట్టడంతో విద్య అక్కడికక్కడే మృతి చెందిందని తెలుస్తోంది. భార్య మృతి చెందగా నందీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బన్నూరు స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసి పరారైన నందీష్ కోసం గాలిస్తున్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన విద్యా మైసూరు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యవహరించారు. పోలీసులు కుటుంబ సభ్యులు మరియు పొరుగువారి నుండి మరింత సమాచారం సేకరిస్తున్నారు.