NTV Telugu Site icon

RGV, Urmila: ఆర్జీవీతో గొడవలు..ఓపెన్ అయిన నటి ఊర్మిళా మతోండ్కర్

Untitled Design (18)

Untitled Design (18)

అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. ముఖ్యంగా హారర్ మూవీస్ తన నటనకు తిరుగులేదు అని చెప్పాలి. ఇక ఊర్మిళ మన దగ్గర సినిమాలు చేసి చాలా కాలమైంది. నార్త్ లోనే సెటిల్‌ అయిన ఈ లేడీ పెళ్లి చేసుకున్నాక, ఫ్యామిలీ లైఫ్‌కీ, టీవీ షోలకీ పరిమితమయ్యారు. చివరగా 2018 లో ‘బ్లాక్ మెయిల్’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , ఊర్మిళా మధ్య గొడవలు జరిగాయని, అందుకే వారు ఎక్కడ కూడా మీట్ అవ్వడం లేదు అని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వర్మ దర్శకత్వం వహించిన ‘సత్య’ మూవీ రిరీలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ.. 1998 లో వచ్చింది. ఇందులో జేడీ చక్రవర్తి హీరోగా, ఊర్మిళా మతోండ్కర్ హీరోయిన్‌గా చేశారు. కాగా ఈ ‘సత్య’ మూవీ రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఊర్మిళా ఆర్జీవీతో గొడవలపై క్లారిటీ ఇచ్చింది.

ఊర్మిళా మాట్లాడుతూ ‘ఆయన డైరెక్ట్ చేసిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’ వంటి హిట్ మూవీస్ లో హీరోయిన్ గా చేశాను. ఆయన మూవీస్‌లో చాన్స్ దొరకడం నా లక్ అని చెప్పాలి. ఇలాంటి లేని పోనీ రూమర్స్ నమ్మోద్దు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. కలవాలి మీట్ అవ్వాలి అంటే.. కెరీర్ పరంగా ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఇప్పుడు ఒక సందర్భం ఉంది కనుక మీ అందరితో కలిసి మాట్లాడుతున్న. వర్మ గారితో కూడా అలాగే. సినిమాకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే నేరుగా మాట్లడుకుంటాం’ అని కొట్టిపారేసింది ఊర్మిళా. ఈ క్రమంలో నటి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.