NTV Telugu Site icon

Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!

Actress Sruthi Shanmuga Priya Responds On Husband Death

Actress Sruthi Shanmuga Priya Responds On Husband Death

Actress Sruthi Shanmuga Priya Responds on husband death: తమిళ సన్ టీవీలో ప్రసారమైన నాథస్వరం సీరియల్‌లో రాగిణి క్యారెక్టర్‌తో నటిగా అరంగేట్రం చేసిన నటి శ్రుతి షణ్ముఖప్రియ భర్త హఠాన్మరణం చెందారన్న సంగతి తెలిసిందే. నటి శ్రుతి షణ్ముఖప్రియ భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులో పెళ్లయి రెండేళ్లు కూడా పూర్తి కాక మునుపే గుండెపోటుతో మరణించారు. ఈ నేప‌థ్యంలో త‌న భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత తొలిసారిగా శ్రుతి ఓ నోట్ షేర్ చేసింది. ఈ మధ్య కాలంలో అసలు మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఉన్నా మరణం అందరికీ సాధారణమే. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియక పోయినా.. ఆ చావు కారణంగా వారిని ప్రేమించి వారో ఎడబాటును అంగీకరించని ఎంతో మంది మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులో ఇప్పుడు జిమ్ నడుపుతున్నాడు. 2022లో మిస్టర్ తమిళనాడు టైటిల్ కూడా గెలుచుకున్న ఆయన అదే సమయంలో నటి శ్రుతి షణ్ముగప్రియను వివాహం చేసుకున్నారు. భర్త హఠాత్తుగా మరణించిన తరువాత, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మొదటిసారిగా ఒక పోస్ట్‌ను ప్రచురించింది.

Sai Dharam Tej: నాకు భయమేస్తోంది, తీవ్ర మనస్థాపన కలిగిస్తుంది.. అర్ధం చేసుకోండి అంటూ ధరమ్ తేజ్ ట్వీట్!

అందులో, “విడదీయబడినది శరీరం మాత్రమే. కానీ మీ ఆత్మ మరియు మనస్సు నన్ను చుట్టుముట్టాయి మరియు ఇప్పుడు మరియు ఎప్పటికీ నన్ను రక్షిస్తాయి. శాంతితో విశ్రాంతి తీసుకోండి నా ప్రేమ, మీ పట్ల నా ప్రేమ ఇప్పుడు మరింత పెరుగుతోంది.” అంటూ రాసుకొచ్చింది. అలా ఈ నటి శృతి, నాథస్వరం, భారతీ కన్నమ్మ, వాణి రాణి, కల్యాణ పరి, బొమ్ము కుట్టి అమ్మావు వంటి అనేక సీరియల్స్‌లో నటించింది. అయితే పెళ్లయిన తర్వాత ఏ సీరియల్‌లోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రుతి తరచూ తన భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ పోస్టులోనే ఆమె మేము ఇప్పటికే ఒకరికొకరు చాలా జ్ఞాపకాలను కలిగి ఉన్నాము. వాటిని నా జీవితాంతం గుర్తుపెట్టుకున్నా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, లవ్ యూ అరవింద్, నా దగ్గర నీ ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నా అని తన భర్తతో కలిసి సంతోషిస్తున్న ఫొటోను కూడా పంచుకుంది. ఇది రాస్తూనే ఆమె మీడియాను కూడా అభ్యర్ధించింది.

అన్ని YouTube ఛానెల్‌లు, న్యూస్ ఛానెల్‌లు. మీడియాకు ఒక దయతో కూడిన అభ్యర్థన. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి, దయచేసి మమ్మల్ని బాధించకండి. మేము చాలా క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము. మా పెద్దలకు బలాన్ని ఇస్తున్నాము. మీకు డబ్బు సంపాదించి పెట్టే లైక్‌లు, వ్యూస్ కోసం మీ వార్తల వీడియోలు మీరు పోస్ట్ చేస్తున్న ఫేక్ సమాచారం, మమ్మల్ని నాశనం చేస్తాయి. కాబట్టి మీరు మీ ఛానెల్‌లలో ఏదైనా అసంబద్ధమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే ముందు ఆలోచించండి, ఎందుకంటే అలా చేయడం అంటే ఈ పరిస్థితిలో ఇది మాకు మరింత బాధ, వేదనను గురి చేస్తింది. ఈ సమయంలో మీ సానుభూతితో నాకు బలం చేకూర్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు అని అంటూ ఆమె రాసుకొచ్చింది.