NTV Telugu Site icon

Sona: పుట్టకతో ఎవరు చెడ్డవారు కాదు.. శృంగార తారగా నన్ను..

Sona

Sona

Sona: కోలీవుడ్ నటి సోనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృంగార తారగా సోనాపై ప్రేక్షకులు ముద్ర వేశారు. తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషలో కలిపి 150 పైగా సినిమాలు చేసింది. ముఖ్యంగా సోనాకు గుర్తింపు తెచ్చిన సినిమా రంగం. ఆ చిత్రంలో కోటాశ్రీనివాసరావును గెలిపించడానికి ప్రచారానికి వచ్చే హీరోయిన్ లా కనిపిస్తుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ లో ఆమె కనిపిస్తూనే ఉంటుంది. ఇక సోనా ప్రస్తుతం డైరెక్టర్ గా మారింది. స్మోక్ అనే సినిమాను తెరకెక్కించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ లో అనుభవించిన అనుమానాలను, అవమానాలను ఏకరువు పెట్టింది. తనపై ఉన్న శృంగార తార అనే ముద్ర తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Bigg Boss Telugu 7: నువ్వెంత.. నీ బతుకెంత.. బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

“నేను నటిగా 2000 సంవత్సరం లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నేను కెరీర్ ను మొదలుపెట్టి 23 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో నేను చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. మెంటల్ గా, ఫిజికల్ గా చాలా గాయాలు అయ్యాయి. ఎన్నో సినిమాల్లో నటించాను.. ఆ అవమానాలను తట్టుకోలేక సినిమాలు కూడా మానేయాలనుకున్నాను. ఎప్పటినుంచో నేను నాపై పడిన శృంగార తార అనే ముద్రను పోగొట్టుకోవాలని అనుకుంటున్నాను. నన్నెందుకు శృంగార తార అని ముద్ర వేశారో వెతుకుతూ వచ్చాను. పుట్టకతో ఎవరు చెడ్డవారు కాదు.. వారికి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు కారణంగా జీవితాలు మలుపు తిరుగుతాయి. ఈ స్మోక్ సినిమా నాలో కొత్త కోణాన్ని చూపిస్తుంది. నా జీవితంలో 99.9% కు సంబంధించినవే ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ తరువాత కొన్ని పర్యవసానాలు ఎదురవుతాయి. కానీ, నేను వాటిని పట్టించుకోను” అని చెప్పుకొచ్చింది. మరి వెబ్ సిరీస్ తో సోనా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments