NTV Telugu Site icon

Actress Sky Bri: వద్దన్నా.. శృంగారం పిచ్చితో ఆ పని చేసిన నటి

Sky Bri Journey

Sky Bri Journey

Actress Sky Bri Shares Her Emotional Journey: ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. అయితే.. ఇప్పుడు మనం మాట్లాడుకునే నటికి శృంగారం పిచ్చి ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకోవడం కోసం ఈమె ఏం చేసిందో తెలుసా? అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సరైన మార్గమని అనుకున్న ఈ అమ్మడు.. తన కుటుంబాన్ని సైతం కాదనుకొని ఆ పరిశ్రమలోకి వెళ్లింది. ఆ నటి పేరు స్కై బ్రి. 23 ఏళ్లకే ఈ అమ్మడు అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే.. ఎంత శృంగార కోరికలు ఉన్నప్పటికీ తాను నెలకు కేవలం రెండు సార్లే ఆ సన్నివేశాల్లో నటిస్తున్నానని తెలిపింది. అయితే.. తనది మతపరమైన (సూపర్ క్రిస్టియన్) కుటుంబం కావడం వల్ల, తాను ఆ చిత్రాల్లో నటించినందుకు తన కుటుంబం తనని బహిష్కరించిందని ఎమోషనల్ అయింది.

కానీ.. ఇండస్ట్రీలోకి వచ్చి, నటిగా మంచి గుర్తింపు సాధించిన తర్వత తనకు తన తల్లి నుంచి మద్దతు లభించిందని స్కై బ్రి పేర్కొంది. తనని కలవడానికి అప్పుడప్పుడు వస్తుందని, తాను బాధలో ఉన్నప్పుడు తల్లితో కాసేపు సమయాన్ని గడుపుతానని చెప్పింది. కాకపోతే.. మిగిలిన కుటుంబ సభ్యులే ఇంకా దూరంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీకి వచ్చాక ఎంతోమందిని దూరం చేసుకున్నానని తెలిపిన ఈ అమ్మడు.. ఇంకొన్నాళ్లు మాత్రమే ఈ పరిశ్రమలో ఉంటానని తెలిపింది. ఎందుకంటే.. అందరిలాగే తనకు ప్రేమ కావాలని కోరింది. అయినా.. ప్రజలు సైతం క్రేజ్ ఉన్నంతవరకే ఆదరిస్తారని, తాను కూడా ఆ క్రేజ్ ఉన్నన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగి, బాగా డబ్బులు సంపాదించి, ఆ తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.

ఇతరుల్లాగా తాను ఈ అడల్ట్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని అనవసరంగా ఖర్చు చేయడం లేదని, ఇప్పటివరకూ సంపాదించిందంతా ఆదా చేసి పెట్టుకున్నానని స్కై బ్రి చెప్పింది. ఈ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మరింత డబ్బు ఆదా చేయాలని అనుకుంటున్నానని, ఆ డబ్బుతో శాన్‌డియాగోకు వెళ్లి నివాసం ఉండాలనుకుంటున్నానని తన మనసులోని మాటని బయటపెట్టింది. వీలైనంత త్వరగా బాగా డబ్బులు సంపాదించి.. ఈ అడల్ట్ ఇండస్ట్రీకి స్వస్తి పలకాలనుందని, అప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానంటూ ఎమోషనల్ అయ్యింది ఈ శృంగార తార.

Show comments