Site icon NTV Telugu

Sabha Kamar : ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మాకు అవమానమే.. పాక్ నటి ఆవేదన

Sabha Kamar

Sabha Kamar

Sabha Kamar : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పహల్గాం దాడితో ప్రపంచమంతా భారత్ కు మద్దతు తెలుపుతోంది. తీవ్రవాదుల దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ సమయంలోనే పాక్ మీద భారత్ తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్ నటి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పాక్ నటి సభా కమర్ మాట్లాడుతూ.. ‘మా పాకిస్థాన్ వాళ్లు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సరే ఘోరంగా అవమానం తప్పట్లేదు. మమ్మల్ని అందరికంటే వేరుగా చూస్తూ ఉంటారు. ఓ సారి నేను షూటింగ్ కోసం జార్జియాలోని టిబిలిసికి వెళ్లాను. అక్కడ భారతీయులను అందరినీ పంపించారు.
Read Also : Sritej: సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీ తేజ డిశ్చార్జ్

కానీ నా పాస్ పోర్టు చూసి ఆపేశారు. నేను పాకిస్థానీ అని తెలిసి.. నన్ను చాలా ప్రశ్నలు అడిగిన తర్వాత గానీ పంపించలేదు. అప్పుడు సిగ్గుగా అనిపించింది. మా దేశంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మా పరిస్థితి ఏంటో బాగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ అయింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లపై భారతీయులు కౌంటర్లు వేస్తున్నారు. ఇతర దేశాల వాళ్ల మీద దాడులు చేస్తే అలాగే చూస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version