సౌత్ సిల్వర్ స్క్రీన్ మీద ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆర్కే రోజా తరువాత రాజీకీయాల్లో బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను తమిళ చిత్ర పరిశ్రమలో చాలా పవర్‌ఫుల్‌గా మొదలుపెట్టారని తెలుస్తోంది. కేవలం ఒక సినిమాతోనే ఆగకుండా, వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేస్తూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు రోజా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా నటిస్తున్న సినిమా పేరు’లెనిన్ పాండియన్’. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న ‘శాంతనం’ అనే పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతోంది అని అంటున్నారు.
Also Read: Prabhas : న్యూ ఇయర్ కానుకగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ‘కల్కి 2’ అప్డేట్.
సాధారణంగా గ్లామరస్ పాత్రలకు పెట్టింది పేరు అయిన రోజా, ఈ చిత్రంలో అందుకు భిన్నంగా చాలా సహజంగా, డీ-గ్లామర్ లుక్‌లో కనిపించనున్నారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, నటిగా ఆమెలోని పదును ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. అయితే ‘లెనిన్ పాండియన్’ షూటింగ్ పూర్తికాకముందే, రోజా మరో భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘జమా’ చిత్ర దర్శక నటుడు పారి ఎలవళగన్ దర్శకత్వంలో ఆమె ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు.
Also Read: Anil Ravipudi: రావిపూడీ.. మరో మెట్టెక్కేసావ్.. ఇదెక్కడి మాస్ ప్రమోషన్ మామ
మిలియన్ డాలర్ స్టూడియోస్ (గుడ్ నైట్, లవర్ వంటి హిట్స్ అందించిన సంస్థ) ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. రోజా తన అద్భుతమైన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారని అంటున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన సినిమాకే హైలైట్ కానుందని టాక్. ఈ తమిళ సినిమాను తెలుగులోకి కూడా డబ్ అయ్యే అవకాశాలు ఉండటంతో తెలుగు ఆడియన్స్ కూడా రోజా పవర్ ఫుల్ ఎంట్రీని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
