చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రాశీ ఖన్నా గత రెండేళ్లుగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మరీ రెండేళ్లలో ముఖ్యంగా తెలుగులో రాశీ చేసింది మూడు సినిమాలే. అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో మేకర్స్, రాశీకి ఎక్కువ ఛాన్స్ లు ఇవ్వట్లేదు. ఎన్టీఆర్, రవితేజ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా రాశి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కారణం సరైన హిట్ స్ట్రీక్ లేకపోవడమే. ఒక హిట్ మూడు నాలుగు ఫ్లాపులు అన్నట్లు సాగిన రాశి ఖన్నా కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది.
హిట్, ఫ్లాప్ అనే విషయాలని పక్కన పెడితే, రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఫోటోలు ఆమె ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తున్నాయి. ‘వైట్ డ్రెస్’లో ఎద అందాలని చూపిస్తూ రాశీ ఖన్నా అభిమానులకి కిక్ ఇస్తోంది. అరుదుగా కనిపించే అందం కనిపిస్తే యూత్ ఆగుతారా, రాశీ ఖన్నా ఫోటోలని వైరల్ చేస్తూ… ‘అమ్మాయి ఇంత అందంగా ఉండడం క్రైమ్ తెలుసా… అర్ధంపర్ధం లేకుండా ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి’ అంటూ కవిగా మారిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా నిజమే కదా, రాశీ ఖన్నా మరీ ఇంత అందంగా కనిపిస్తే ఎలా? యూత్ ఏమై పోవాలి?
