NTV Telugu Site icon

Noor Malabika: నూర్ మరణంపై మౌనం వీడిన కుటుంబ సభ్యులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Noor Malabika Death News

Noor Malabika Death News

Actress Noor Malabika Family Said She Was Suffering From Depression: నటి నూర్ మాలాబికా దాస్ సూసైడ్ చేసుకుని మరణించింది. ఆమె మరణ వార్త నిన్ననే వెలుగులోకి వచ్చింది. సోమవారం లోఖండ్‌వాలాలోని నూర్ ఫ్లాట్ నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆమె డిప్రెషన్‌కు గురైందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అనేక వెబ్ సిరీస్‌లలో పనిచేసిన నూర్ మలాబిక, కాజోల్‌తో కలిసి ‘ది ట్రయల్’ సిరీస్‌లో కనిపించింది. నూర్ అస్సాంలోని కరీంగంజ్ నివాసి.

Gnanasagar Dwaraka Interview : కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్ గన్ ఎలా తయారు చేశాడు?.. ప్రతి లొకేషన్ కి నెమలి!

ఆమె అత్త ఆర్తీ దాస్ దివంగత నటి గురించి మాట్లాడుతూ, ఆమె చాలా అంచనాలతో ముంబైకి వెళ్ళింది. నటి కావాలని ఎన్నో అంచనాలతో ముంబై వెళ్లింది. అయినప్పటికీ, ఆమె అది సాధించడానికి చాలా కష్టపడింది. అయితే తన విజయాలతో సంతోషంగా లేదని, దాని కారణంగానే ఆమె ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని అనిపిస్తోందని అన్నారు. ఇక ఆమె అనేక హిందీ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లలో పనిచేసింది. నటనలోకి రాకముందు ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా కూడా పనిచేసింది. నూర్ మల్బిక ‘సిస్కియాన్’, ‘వాక్‌మ్యాన్’, ‘టిఖి చట్నీ’, ‘జగహన్య ఉపాయ’, ‘చర్మ్‌సుఖ్’, ‘దేఖి అందేఖి’ మరియు ‘బ్యాక్‌రోడ్ హస్టిల్’ మొదలైన చిత్రాల్లో నటించింది. ఆమె చివరిగా కాజోల్ మరియు జిషు సేన్‌గుప్తాతో కలిసి ‘ది ట్రయల్’లో కనిపించింది.

Show comments