Site icon NTV Telugu

Meena: సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత

Meena

Meena

సీనియర్ హీరోయిన్ మీనా నివాసంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి హఠాత్తుగా మృతిచెందాడు. ఇటీవల పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కరోనా అనంతరం ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో విద్యాసాగర్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా కోలుకోలేకపోవడంతో విద్యాసాగర్ తుదిశ్వాస విడిచాడు.

Read Also: Vadde Naveen: బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న సీనియర్ స్టార్ హీరో..?

బెంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్త విద్యాసాగ‌ర్‌తో 2009లో హీరోయిన్ మీనా వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది‌. ఆమె పేరు నైనిక‌. దళపతి విజ‌య్ హీరోగా వ‌చ్చిన తేరీ సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. వివాహం జరిగిన తర్వాత మీనా కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. దృశ్యం, దృశ్యం-2, రజనీకాంత్ అన్నాత్తె, మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియా వంటి సినిమాల్లో మీనా నటించి మెప్పించింది.

Exit mobile version