NTV Telugu Site icon

Vijay Devarakonda: రౌడీ హీరో పరువు తీసిన బ్యూటీ.. ఇంత అవమానం అవసరమా..?

Vijay

Vijay

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం లైగర్ ప్లాప్ తో కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. లైగర్ సినిమాతో హిందీలో అడుగుపెట్టిన విజయ్, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి చాలానే కష్టపడ్డాడు. కానీ, ఫలితం మాత్రం రాలేదు. అయితే ఒకప్పుడు హిందీ అంటే ఇష్టంలేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు హిందీలో సినిమా తీయడం ఆశ్చర్యంగా ఉందని బాలీవుడ్ హీరోయిన్ మలోబిక బెనర్జీ రౌడీ హీరోను ఉద్దేశించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. విజయ్, మలోబిక కలిసి ఒక ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. నీ వెనకే నడిచి అంటూ సాగే ఈ సాంగ్ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విజయ్ గురించి మాట్లాడుతూ ” మేమిద్దరం ఆ సాంగ్ చేసేటప్పుడు పరిచయమయ్యాం. మంచిగా మాట్లాడుకొనేవాళ్లం . అయితే అప్పుడు విజయ్ కు హిందీ వచ్చేది కాదు.. తెలుగులోనే మాట్లాడేవాడు.. నేను హిందీలో మాట్లాడేదాన్ని.. నా భాష చూసి నవ్వుకొని హేళన చేసేవాడు. కానీ ఇప్పుడు అదే భాషలో సినిమా తీశాడని ఆశ్చర్యపోయాను. ఇక లైగర్ టీజర్ చూసి విజయ్ హిందీ మాట్లాడుతుంటే నవ్వుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు వ్యాఖ్యలపై రౌడీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నా.. మనకు ఇది అవసరమా..? హిందీ వాళ్ళతో ఇలా అనిపించుకోవడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.