Site icon NTV Telugu

Actress Babilona: శృంగార నటి ఇంట తీవ్ర విషాదం.. అనుమానాస్పద స్థితిలో మృతి!

Babilona Brother Died

Babilona Brother Died

Actress Babilona Brother Vignesh Found Dead: తమిళ శృంగార నటి నటి బాబిలోనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అకా విక్కీ ఇటీవల చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. అందుతున్న సమాచారం ప్రకారం, విఘ్నేష్ వయస్సు 40 సంవత్సరాలు. సాలిగ్రామం దశరథ పురం 8వ వీధిలోని తన అపార్ట్‌మెంట్‌లో విఘ్నేష్ ఒంటరిగా ఉండేవాడు. 40 ఏళ్ల విక్కీ మీద విరుగంపాక్కం పోలీస్ స్టేషన్‌లో వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దశరథపురం 8వ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విఘ్నేష్‌కమర్ ఒంటరిగా నివాసముంటున్నాడు. అయితే ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. విఘ్నేష్ ఇంటి తలుపు లోపల నుంచి గడియ వేసి ఉందని, చాలా సేపటికి తలుపు తట్టినప్పటికీ అతను తెరవలేదని అతని స్నేహితుడు మీడియాకు తెలిపాడు. దీంతో వారికి అనుమానం వచ్చి వెంటనే విరుగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.

Arjun Sarja: గ్రాండ్ గా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం..

అప్పుడు బెడ్‌రూమ్‌లో విక్కీ అనుమానాస్పదంగా చనిపోయాడని చూసి షాక్ అయ్యారు. పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో గత కొన్నేళ్లుగా విఘ్నేష్‌కుమార్ ఒంటరిగా ఉంటున్నాడు. అతని ఫ్లాట్ అంతా చాలా ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి, అతను అతిగా మద్యం సేవించి చనిపోయాడా? లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విక్కీ తల్లి మాయ తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాబిలోనా తమిళ సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలు పోషించి ఫేమస్ అయింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఫిట్‌నెస్ ట్రైనర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమా రంగానికి పూర్తిగా దూరమై భర్త, పిల్లలతో హ్యాపీగా గడుపుతోంది.

Exit mobile version