Arundhati Nair: 40 లక్షలయ్యాయి, ఇక డబ్బు లేదు, సాయం చేయండి.. వెంటిలేటర్‌పైనే నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Arundhathi Nair Stil Fighting on ICU: స్కూటీ మీద వెళుతూ కారు ప్రమాదంలో గాయపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న నటి అరుంధతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం అరుంధతి తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ సాయంతో ఆమె శ్వాస తీసుకుంటోంది. ఇక ఈ వైద్యం కోసం రోజూ దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని, అరుంధతి కోసం ఆ కుటుంబం ఇప్పటికే 40 లక్షలు వెచ్చించిందని చెబుతున్నారు. ఖర్చులు కష్టాల్లో ఉన్న సమయంలో ఆ కుటుంబం సాయం కోసం కోరుతూ ముందుకు వచ్చింది. అరుంధతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో, నటిని వెంటిలేటర్‌కు తరలించారు. రోజూ దాదాపు 2 లక్షల మంది ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చవుతోంది. ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చు చేశామని అరుంధతి సోదరి ఆర్తి మీడియాకు తెలిపారు.
Nayanthara: చిన్నప్పటి నయనతారని చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో?
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
90 రోజులు దాటినా ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని, విరిగిన పక్కటెముకలకి కూడా శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది కాబట్టి తమకు సాయం చేయాలని ఆమె కోరారు. యూట్యూబ్ ఛానల్ కి వెళ్లి షూటింగ్ ముగించుకుని తన సోదరుడితో కలిసి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారిని ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్లిపోగా గాయపడి గంటపాటు రోడ్డుపైనే పడి ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇక అప్పటి నుంచి నటి గోపికా అనిల్‌తో సహా పలువురు సోషల్ మీడియా ద్వారా అరుంధతి చికిత్స కోసం సహాయం కోసం అభ్యర్థించారు. అరుంధతి సోదరి ఆర్తీ నాయర్ కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అరుంధతీ నాయర్ తమిళ చిత్రాల ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది. సైతాన్(తెలుగులో భేతాళుడు) సినిమాలో విజయ్ ఆంటోని నటనకు టర్నింగ్ పాయింట్. 2018లో వచ్చిన ఒట్టక్కోరు ఆకవంకన్ చిత్రంలో షైన్ టామ్ హీరోయిన్ గా ఆమె మలయాళంలో కూడా అడుగుపెట్టింది. గతేడాది విడుదలైన అహియాన్ పోర్కాసెస్ ఆమె నటించిన చివరి చిత్రం.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!