Site icon NTV Telugu

R Madhavan-Suriya: గుర్తుపట్టలేనంతగా మారిన మాధవన్.. షాక్ లో సూర్య

Suriya

Suriya

హీరోలు.. ఒక సినిమా కోసం ఏదైనా చేయగల సమర్థులు. బాడీ పెంచాలన్న, బాడీ తగ్గించాలన్నా.. అందంగా కనిపించాలన్నా, అందవిహీనంగా కనిపించాలన్న వారికే చెల్లుతోంది. ఇక బయోపిక్ ల విషయానికొస్తే.. ఒరిజినల్ వ్యక్తులను కూడా మైమరిపించేస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ అదే పని చేస్తున్నాడు. మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తునానఁ చిత్రం ‘రాకెట్రీ’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మాధవన్ లుక్ చుస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. అచ్చు గుద్దినట్లు నంబి నారాయణ్ లా మారిపోయి మాధవన్ డెడికేషన్ కు దండం పెట్టక మానరు. తాజాగా హీరో సూర్య కూడా అదే పని చేశాడు. ఈ చిత్రంలో సూర్య ఒక క్యామియో రోల్ లో నటిస్తున్నాడు. అతను పాత్ర చిత్రీకరణ కోసం సెట్ లో అడుగుపెట్టిన సూర్య కు నంబి నారాయణ్ ఒరిజినల్, నంబి నారాయణ్ రీల్ హీరో మాధవన్ ఒకేసారి కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

అసలు ఎవరు ఒరిజినల్ నంబి నారాయణో తేల్చుకోలేక కన్ప్యూజ్ అయ్యి దండం పెట్టేశాడు. కొద్దిసేపటి తరువాత మాధవన్, సూర్యను కౌగిలించుకొని ముచ్చటించారు. అనంతరం నంబి నారాయణ్, సూర్యను పలకరించారు. సూర్య సినిమాలు చూస్తూ ఉంటానని, అతడి తండ్రి శివ కుమార్ కూడా తనకు తెలుసనీ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోను మాధవన్ షేర్ చేస్తూ “కేవలం నా బ్రదర్ సూర్య మాత్రమే నాకు ఇంత మంచి ఫీల్ ఇచ్చే రియాక్షన్ ఇవ్వగలడు. నంబి సార్ నా బ్రదర్ కు, ఆయన తండ్రికి పెద్ద అభిమాని ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version