Site icon NTV Telugu

Hero Sriram : డ్రగ్స్ కేసులో నటుడు ‘శ్రీరామ్’ కు రిమాండ్

Kollywood

Kollywood

తెలుగు, తమిళ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. పోలీసుల స్టైల్ లో విచారణ చేపట్టగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తామని నిందితులు తెలిపారు.

Also Read : Bollywood : మారుతున్న బాలీవుడ్ ఆడియెన్స్ తీరు.. హారర్, యాక్షన్ సినిమాలకు బై.. బై

రంగమంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ అదుపులోకి తీసుకుని ఆయన వద్ద నుండి కొకైన్ స్వాదీనం చేసుకున్నారు. అనంతరం శ్రీరామ్ ను అరెస్ట్ చేసారు. వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు పోలీసులు. తదుపరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీరామ్ ను కోర్టులో హాజరుపరచగా జులై ఏడవ తేది వరకు రిమాండ్ విధించింది చెన్నై ఎగ్మోర్ కోర్టు. ఈ నేపథ్యంలో నటుడు శ్రీరామ్ ని కస్టడీ కోరుతూ నేడు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు నుంగంబాకం పోలీసులు. శ్రీరామ్ ను విహచరిస్తే కోలీవుడ్ కు చెందిన పలువురు నటుల పేర్లు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అన్నాడీఎంకే కు చెందిన ప్రసాద్ కు పలువురి తమిళ సినిమా నటులతో పరిచయాలు ఉన్నాయని అటువైపుగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్రీరామ్ డ్రగ్స్ లో ఇతర నటినటులు ఎవరు ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎలా తెస్తున్నారు. ఎవరు దీని వెనకఉన్నారు అని పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

 

Exit mobile version