Site icon NTV Telugu

Sreenath Bhasi: బ్రేకింగ్.. మలయాళ స్టార్ హీరో అరెస్ట్

Sreenadh

Sreenadh

Sreenath Bhasi: మలయాళ కుర్ర హీరో శ్రీనాథ్ బాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనాథ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం చట్టంబి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కోసం ఒక టీవీ ఛానెల్ కు వెళ్లిన శ్రీనాథ్.. లేడి యాంకర్ పై విరుచుకు పడ్డాడు. అసభ్యమైన పదజాలంతో ఆమెను దుర్భాషలాడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను మాట్లాడిన మాటలను రికార్డు చేసి పోలీసులకు వినిపించింది. ఇక దీంతో అతడిపై విమెన్ హెరాస్మెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. అయితే శ్రీనాథ్ ఈ అరెస్ట్ ను ఖండించాడు. ఆమె తనను రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు అడిగిందని, అందుకే తాను కోప్పడినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇంటర్వ్యూలో మర్యాద లేకుండా సిల్లీ పప్రశ్నలు వేసి అవమానించినట్లు కూడా చెప్పుకొచ్చాడు.

తన పేరును చెడగొట్టడానికే ఆ యాంకర్ ఆడియో క్లిప్ ను తనకు అనుకూలంగా చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ గా మార్చినట్లు చెప్పుకొచ్చాడు. అయితే లేడీ యాంకర్ మాత్రం శ్రీనాథ్ తనను అవమానించేలా మాట్లాడాడని, అమ్మాయిని అనకూడని మాటలు అందరి ముందు అన్నట్లు చెప్పుకొచ్చింది. తాను స్క్రిప్ట్ లో ఉన్న ప్రశ్నలే అడిగినట్లు చెప్పుకొచ్చిన యాంకర్ సినిమాకు సంబంధించిన విషయాలనే చెప్పమని చెప్పినట్లు తెలిపింది. ఇక ఈ యంగ్ హీరో అరెస్ట్ మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త తెలియడంతో తెలుగు ప్రేక్షకులంతా మాలీవుడ్ విశ్వక్ సేన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్.. లేడీ యాంకర్ పై విరుచుకుపడడం తెల్సిందే.

Exit mobile version