Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soori: తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి, కామెడీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి ఇప్పుడు హీరోగా తన మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విడుతలై’ (Viduthalai) సినిమాతో హీరోగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. తాజాగా ‘మండాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూరి నటనకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో వస్తున్న వార్తలను బట్టి సూరి తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ‘ఇందు నెట్రు నాలై’, ‘అయలాన్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్ ఈసారి సూరితో ఈ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ 2015లో చెన్నైని కుదిపేసిన భారీ వరదల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు, వచ్చే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సూరి ఇంత తక్కువ సమయంలో ఇంతటి స్థాయికి చేరుకోవడం నిజంగా చెప్పుకోదగ్గ పరిణామమే. ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో కనిపించిన ఆయనకు కామెడీ టైమింగ్‌తో మంచి పేరు వచ్చింది. అయితే కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు సూరి.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ఇక తాజాగా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ‘మండాడి’ సినిమాతో సూరి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగు యంగ్ హీరో సుహాస్ ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మతిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో సముద్రం, పడవ పందేల నేపథ్యంలో సూరి పాత్ర సాగుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆయన నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సముద్రంలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్, సూరి పెర్ఫార్మెన్స్పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇలా ఒక్కో సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ వస్తున్న సూరి ఇప్పుడు ఏకంగా రూ.25 కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి చేరుకోవడం సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
- Tags
- cinema
- tamil actor
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!