Actor Shivaji Starrer #90’s Trailer Released: హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘#90’s’, ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సిరీస్ ను రాజశేఖర్ మేడారం నిర్మాణంలో నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ గా మేకర్స్ చెబుతున్న ఈ సిరీస్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ రోజు మేకర్స్ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కనుక మనం పరిశీలిస్తే శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్‌మేట్‌కు వివరించే సీన్‌తో ఆరంభమైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పంచింది. శివాజీ లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ గా అలరించగా ఆయన కుటుంబం, ఇల్లు, స్కూల్‌లో పిల్లల అల్లరి ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా వున్నాయి.
Bubblegum Free Tickets: ఈరోజు, రేపు ఫ్రీగా సుమ కొడుకు సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ట్రైలర్ లో ఒక అమ్మాయి వచ్చి శివాజీని పలకరిస్తూ, ‘నేను సుచిత డేవిడ్ పాల్’ అంటే, కాస్త ఆలోచించి శివాజీ ‘నాకు కేఏ పాల్ తెలుసు’ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ‘మన కోసం మనతో కొట్లాడి నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..’ అంటూ శివాజీ చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఆకట్టుకుంది. ఇక శివాజీ భార్య పాత్రలో వాసుకి ఆకట్టుకున్నారు. కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలని ఎంతో అందంగా మనసుని హత్తుకునేలా ట్రైలర్ లో చూపించారు. 90వ దశకం నాటి పరిస్థితులను ప్రతింబించేలా సినిమాటోగ్రఫీ, సెట్స్‌ను తీర్చిదిద్దిన విధానం, సురేష్ బొబ్బిలి అందించిన నేపధ్య సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈటీవీ విన్ లో ఈ సిరీస్ జనవరి 5 నుంచి స్ట్రీమ్ కానుంది.