NTV Telugu Site icon

Ravi Kishan: అల్లు అర్జున్ విలన్ ఇంట విషాదం

Ravi Kishan

Ravi Kishan

Ravi Kishan: ఇండస్ట్రీలో వరుస మరణాలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కె. విశ్వనాథ్, వాణీ జయరామ్.. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇటీవలే కన్నుమూశారు. ఇక తాజాగా.. ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకొంది. రవికిషన్ సోదరుడు రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్నీ రవికిషన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గతరాత్రి 12 గంటలకు ఆయన గుండెపోటుతో ముంబైలోని నవరాత్రి హాస్పిటల్ లో మృతి చెందినట్లు రవికిషన్ తెలిపాడు. “మా అన్నయ్య రామ్ కిషన్ శుక్లా.. రాత్రి 12 గంటలకు ముంబైలోని నవరాత్రి హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయనకు స్వర్గంలో చోటు ఇవ్వాల్సిందిగా దేవుడ్ని కోరుకుంటున్నాను ” అంటూ ఒక ట్వీట్ లో రాసుకొచ్చాడు. మరొక ట్వీట్ లో తన అన్నయ్య మృతి కుటుంబానికి ఎంతటి బాధను కలిగిస్తుందో చెప్పుకొచ్చాడు.

NTR: ఎందుకన్నా అంత కోపం.. అడిగింది అప్డేటేగా

” రామ్ కిషన్ అన్నయ్య.. నిజంగా మా ఇంటికి రాముడు. ఆయన నిష్కలమైన నవ్వులో ఏ రోజు మోసం చూడలేదు. ఆయన ఆకస్మిక మరణం మా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను ఈ రోజు ఆయన లేకుండా ఒంటరిగా చదివాను. మీరందరూ దయచేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి.. ఓం శాంతి శాంతి” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చదివిన వారందరు.. రామ్ కిషన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక తెలుగువారికి రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం లో విలన్ గా నటించి ఎంతో గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం ఒక పక్క సినిమాలు చేస్తూనే బీజేపీ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Show comments