Site icon NTV Telugu

మంచు విష్ణుకు కమెడియన్ పృథ్వీ మద్దతు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఊహించని పరిణామాలతో హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ స్పష్టం చేయడమే కాకుండా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ రాకను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకోవడంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

ఇక, త్వరలోనే మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించనున్నారు. అయితే ప్రణాళికా బద్దంగా మోహన్‌ బాబుగారి ఆశీర్వాదంతో మంచు విష్ణు మంచి ఆలోచనలు చేస్తున్నాడని.. ఆయనే తన మద్దతు అంటూ కమెడియన్ పృథ్వీ తెలిపారు. నా మద్దతు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై చాలా రోజులుగా నేను మదనపడుతున్నాను. ఉపాధి, అవకాశాలు, ఆరోగ్యం, మా బిల్డింగ్, వృద్దాశ్రమం.. ఇలా అన్నింటిపై పకడ్బందీగా వున్నా మంచు విష్ణుకే పూర్తి మద్దతు అంటూ పృథ్వీ వీడియో ద్వారా తెలియజేశారు.

Exit mobile version