NTV Telugu Site icon

Naga Chaitanya: ఎంగేజ్మెంట్ అయిన రెండ్రోజులకే అంత దూరమెళ్లిన చైతూ

Nagachaitanya News

Nagachaitanya News

Naga Chaitanya attended his personal assistant Venkatesh’s wedding ceremony in Rajahmundry: కొద్ది రోజుల క్రితమే నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన రాజమండ్రిలో తన అసిస్టెంట్ ఒకరి వివాహానికి హాజరయ్యాడు. నాగ చైతన్య వద్ద చాలా కాలం నుంచి వెంకటేష్ అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.
Naga
ఈ నేపద్యంలో నిన్న జరిగిన వెంకటేష్ పెళ్లికి అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో నాగచైతన్య శోభిత ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Unstoppable With NBK: ఒకే స్టేజీపై బాలయ్య కోసం చిరంజీవి?

ఫ్యాన్స్ తయారుచేసిన ఈ వీడియోలలో నాగచైతన్య తండేల్ డైలాగ్ చెబుతూ కనిపిస్తూ ఉండగా దానికి శోభిత నవ్వుతూ కనిపిస్తున్నట్లుగా వీడియోలు క్రియేట్ చేశారు. ఇక ప్రస్తుతానికి సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య తండేల్ అనే సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా మీద గీత ఆర్ట్స్ బ్యానర్ తో పాటు నాగచైతన్య కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాడు. గత ఏడాది నాగచైతన్య చేసిన కస్టడీ అనే సినిమా ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు.

Show comments