Site icon NTV Telugu

నేడు నామినేషన్ వేయనున్న మంచు విష్ణు

నటుడు మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం ఈరోజు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ నామినేషన్లు వేయగా, నేడు మంచు విష్ణు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివియల్ నరసింహారావు పోటీ పడనున్నారు. అక్టోబర్ 10న జరుగనున్న మా ఎన్నికలు జరుగనున్నాయి.

Exit mobile version