Site icon NTV Telugu

Balaiah: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం… ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి

Junior Balaiah

Junior Balaiah

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, సీనియర్ యాక్టర్ టీఎస్ బాలయ్య కొడుకు జూనియర్ బాలయ్య మరణించారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న టీఎస్ బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ బాలయ్య. నటుడిగా జూనియర్ బాలయ్య మొదటి సినిమా మొదలైన మూడు రోజులకే తండ్రి టీఎస్ బాలయ్య మరణించాడు. తండ్రి మరణం తర్వాత జూనియర్ బాలయ్య కెరీర్ అనుకున్నంత గొప్పగా సాగలేదు.

Read Also: Hi Nanna : వైరల్ అవుతున్న హాయ్ నాన్న న్యూ పోస్టర్..

సినిమాలైతే చేస్తూనే ఉన్నారు కానీ జూనియర్ బాలయ్య తన తండ్రి స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇటీవలే పులి, నెర్కొండ పార్వై లాంటి సినిమాల్లో నటించి బిజీ అవుతున్నాడు అనుకున్న జూనియర్ బాలయ్య… ఈరోజు చెన్నైలో తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసున్న జూనియర్ బాలయ్య శ్వాస సంబంధింత సమస్యతో మృతి చెందారు. జూనియర్ బాలయ్య మరణ వార్త కోలీవుడ్ వర్గాలని కలచి వేస్తుంది. సోషల్ మీడియాలో ప్రముఖులు పోస్టులు పెడుతూ జూనియర్ బాలయ్య ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Exit mobile version