Site icon NTV Telugu

Actor Jai: అంజలితో ప్రేమాయణం.. మరో హీరోయిన్ ను పెళ్లాడిన హీరో?

Jai Married Pragya Nagara

Jai Married Pragya Nagara

Actor Jai Married to Pragya Nagara News Viral in Social Media: తమిళ నటుడు జై గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జర్నీ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయిపోయాడు. అదే సినిమాలో నటించిన మన తెలుగు అమ్మాయి అంజలితో కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడపడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం కూడా ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలా ఉండగా ఒకపక్క అంజలి తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంటే జై కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా మరో హీరోయిన్ ప్రగ్యా నగారాతో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు జై. ప్రగ్యా నగారా తమిళ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె మెడలో మంగళసూత్రం ధరించి ఉండగా పక్కనే ఆమెకు బాగా దగ్గర కూర్చున్న జై తన చేతిలో రెండు పాస్పోర్ట్ లు, ఫ్లైట్ టికెట్స్ తో కనిపించాడు. దేవుడి దయతో కొత్త జీవితం స్టార్ట్ అయింది అంటూ ఇద్దరూ ఒకే ఫోటోని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకొని హనీమూన్ కి వెళుతున్నారు అంటూ ప్రచారం మొదలైంది.

Kalki 2898 AD: కల్కిలో ప్రభాస్ లుక్.. అదిరిపోయింది బాసూ!

అంతేకాదు చాలామంది వీరిద్దరికి కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే తమిళ సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఇదంతా ఒక మూవీ ప్రమోషన్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి బేబీ అండ్ బేబీ అనే ఒక సినిమా చేస్తున్నారని ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా జై నటిస్తుండగా హీరోయిన్గా ప్రగ్యా నటిస్తోంది. సత్యరాజ్, యోగి బాబు వంటి వాళ్ళు ఇద్దరు కీలకపాత్రలలో నటిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగించబోతున్నారని తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ ఒక్కసారిగా మొదలుపెట్టే కంటే ఇలా ఏదైనా భిన్నంగా ప్లాన్ చేస్తే త్వరగా జనాల్లోకి వెళ్తుంది అని భావించి ఈ మేరకు ఫొటో రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వారిద్దరూ చెబితే గానీ తెలియదు. అయితే వారిద్దరూ షేర్ చేసిన ఫోటో వెనుక మూవీ కెమెరా అయితే కనిపిస్తుంది. కాబట్టి దాదాపుగా ఇది సినిమా ప్రమోషన్ అని ఫిక్స్ అయిపోవచ్చు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version