NTV Telugu Site icon

Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్

Dhanush

Dhanush

Actor Dhanush -Aishwarya Rajinikanth have filed for divorce at the Chennai family court : 2022 జనవరిలో మేము విడిపోతున్నామని వేరువేరుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన తమిళ స్టార్ హీరో ధనుష్ మరో స్టార్ హీరో కుమార్ ఐశ్వర్య రజినీకాంత్ ఎట్టకేలకు ఈ వివాహ బంధాన్ని ముగించేందుకు ముందుకు వచ్చారు. తమకు మ్యూచువల్ కన్సల్ట్ డైవర్స్ మంజూరు చేయాలని కోరుతూ సినీనటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2004లో జరిగిన తమ వివాహాన్ని రద్దు చేయాలని అదే పిటీషన్ లో వారు కోరారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది. నటుడు ధనుష్ – రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి నవంబర్ 18, 2004న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చెన్నైలో జరిగింది. ఇక వీరికి లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో గత కొన్నేళ్లుగా ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.

Kangana Raunat: ఖరీదైన కారును కొన్న కంగనా..ఎన్ని కోట్లో తెలుసా?

2022 జనవరిలో, ఇద్దరూ విడిపోయామని వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించడం గమనార్హం. ఐశ్వర్య మరియు ధనుష్ ఇద్దరి పిల్లలు ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి పిల్లలను చూసుకునే బాధ్యతను ఇద్దరూ నిర్వహిస్తున్నారు. వారు 2022లో విడిపోయారని ప్రకటించినప్పుడు, షాక్‌కు గురైన అభిమానులు, “వారు ఇంకా విడాకులు తీసుకోలేదు, వారు ఎలాగైనా తిరిగి కలుసుకుంటారు” అని అనుకున్నారు. అయితే ఇప్పుడు వారి బంధం అధికారికంగా ముగిసినట్టే చెప్పాలి. ధనుష్‌తో ఐశ్వర్య రజనీకాంత్ 3 సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా యువతలో మంచి ఆదరణ పొందింది. అదేవిధంగా ధనుష్ ఆమె డైరెక్ట్ హేసినా ‘వై రాజా వై’ చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం ధనుష్ తను దర్శకత్వం వహిస్తున్న ఇళయరాజా బయోపిక్ విడుదలలో బిజీగా ఉండగా, ఐశ్వర్య తన ఫిట్‌నెస్ మరియు సినిమా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టింది.