NTV Telugu Site icon

Actor Dies Of Heart Attack: ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. నెల రోజుల్లో నాలుగో నటుడు మృతి!

Heart Attack

Heart Attack

Actor Arulmani Dies Of Heart Attackతమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ క్యారెక్టర్ నటుడు అరుళ్ మణి గుండెపోటుతో మరణించారు. అతని వయసు 65. అరుళ్ మణికి భార్య, కూతురు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థుల తరఫున అరుళ్ మణి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 10 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్న అరుళ్ మణి నిన్ననే చెన్నైలోని తన ఇంటికి వచ్చారు. ఆయన మృతి పట్ల ఆయన అభిమానులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు… ఇది సినీ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏఐఏడీఎంకే స్టార్ స్పీకర్‌గా ఎదిగిన అరుళ్మణి.. పలు చిత్రాల్లో నటించారు.. ప్రత్యేకించి అళగి, తెనారల్, తాండవక్కోనే సహా పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలపై కూడా ఆసక్తి పెంచుకున్న అరుళ్మణి.. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి ఆ సంస్థ కోసం ఎంతో సీరియస్‌గా పని చేశారు.

Chiranjeevi: తేజ సజ్జ చేశాడు.. ఇక నేను చేయనక్కర్లేదు..చిరు ఆసక్తికర వ్యాఖ్య లు

అందుకే అరుల్మణి ఎక్కువగా ఏఐఏడీఎంకే ప్రధాన వేదికలపై కనిపిస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడ సభ జరిగినా రంగంలోకి దిగుతారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరుళ్మణి అన్నాడీఎంకే తరఫున ప్రచారం చేశారు. గత 10 రోజులుగా ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అరుళ్మణి నిన్న చెన్నైకి తిరిగి వచ్చి.. తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో గుండె పోటు వచ్చింది. దీంతో అరుల్మణిని వెంటనే రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.. అయితే వైద్యులు ప్రయత్నించినప్పటికీ రాత్రి 9.30 గంటలకు అరుల్ మణి మృతి చెందారు. ఇదిలా ఉంటే అరుళ్మణి చివరి ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.. 4 రోజుల క్రితం తిరుచ్చిలో జరిగిన ఎడప్పడియార్ బహిరంగ సభలో అరుల్ మణి ఫోటో దిగారు. ఆ ఫోటోలో నటులు సింగముత్తు, అరుళ్మణి, దర్శకులు మనోజ్ కుమార్, నాంజిల్ బీసీ అన్పహగన్ ఉన్నారు. ఈ ఫోటోను ఏఐఏడీఎంకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతాపం వ్యక్తం చేసింది. అలాగే అరుళ్మణితో తమ జ్ఞాపకాలను కన్నీళ్లతో పోస్ట్ చేస్తున్నారు.

Show comments