NTV Telugu Site icon

Brahmaji: కుక్కతో శోభనం బావుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..

Brahmaji

Brahmaji

Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా.. ఇలా పాత్ర ఏదైనా.. బ్రహ్మాజీ ఇచ్చి పడేస్తాడు. కేవలం సినిమాలో మాత్రమే కాదు.. బయట కూడా ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, చిట్ చాట్ సెషన్స్, బుల్లితెర షోస్.. ఎందులో అయినా బ్రహ్మాజీ ఉన్నాడు అంటే కామెడీకి కొదువలేదు అని మాత్రం పక్కాగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం బ్రహ్మాజీ.. తన కొడుకు సంజయ్ ను హీరోగా నిలబెట్టడానికి బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఓ పిట్టకథ అనే సినిమాతో కొడుకును లాంచ్ చేసిన బ్రహ్మాజీ.. ఇప్పుడు స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాతో రీలాంచ్ చేయబోతున్నాడు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ బ్రహ్మాజీని రంగంలోకి దించాయి.

SS Thaman: కావాలని ఫ్లాప్ సినిమాలు చేస్తారా? ‘గుంటూరు కారం’పై స్పందించిన థమన్

తాజాగా బ్రహ్మాజీ, చిత్రబృందంతో కలిసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో బ్రహ్మాజీ, రిపోర్టర్ సురేష్ కొండేటిని ఆడుకున్నాడు. ప్రతి ప్రెస్ మీట్ లోనూ.. సురేష్ కొండేటి.. కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగి విమర్శలు అందుకుంటున్న అతనిని ఈసారి బ్రహ్మాజీ ఆడేసుకున్నాడు. మైక్ అందుకున్న బ్రహ్మాజీ.. మొదట ఎవరు ప్రశ్నలు అడుగుతారు అంటూ మొదలుపెట్టి.. సురేష్ కొండేటి అడిగే ప్రశ్న అయితే నాకు ముందే తెలుసు అని చెప్పుకొచ్చాడు. సురేష్ అయితే ఏమడుగుతాడు అంటే.. ” కుక్కతో పెళ్లి చేశారు కదా.. మరి శోభనం కూడా కుక్కతోనే చేసారా.. ? అని అడుగుతాడు” అని చెప్పాడు. దానికి సురేష్ కొండేటి.. మరి ప్రశ్న ఒక్కటే చెప్పారు.. సమాధానం కూడా చెప్పండి అనగానే తడుముకోకుండా.. “కుక్కతో శోభనం బావుంది.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.. ” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారందరూ ముఖాల్లో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.